
వారాహి అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి రోజూ పారాయన స్త్రోత్రంగా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది. అదే శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి).
నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం 1 ..
త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం 2 ..
దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..
లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం 4..
కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్య వాసినీం 5..
ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం 6..
విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం 7..
పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం 8.
దీంతో పాటు వారాహి ద్వాదశ నామ స్తోత్రం కూడా తెలుసుకుందాం. అదేంటంటే..
అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||
వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా |
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||
నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||
