Site icon Bhakthi TV

శక్తేశ్వర స్వామి ఆలయ మహిమలు తెలిస్తే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులోని శివాలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయ మహిమలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఆలయంలో ఒక శక్తి కుండం అనే చెరువు ఉంటుంది. స్వామివారికి నైవేద్యాన్ని ఈ చెరువులోని నీటితో వండితేనే ఉడుకుతుందట. కొంతకాలం కిందట చెరువును తవ్వేందుకు శక్తికుండాన్ని ఎండబెట్టడంతో వేరే నీటితో ఆలయ అర్చకులు నైవేద్యాన్ని వండారట. కానీ అది ఏమాత్రం ఉడకలేదట. ఆ తరువాత శక్తికుండంలోని కొంత మట్టిని తొలగించి నీరు కాస్త ఊరిన తర్వాత వాటితో నైవేద్యం వండితే ఉడికిందట.

ఈ శక్తి కుండంలోనికి కాశీ నుంచి అంతర్వాహినిగా గంగ ప్రవహిస్తుందని అక్కడి వారి నమ్మకం. కాబట్టి ఈ నీటిని గంగాజలంగా అక్కడి వారంతా స్వీకరిస్తారు. స్వామివారి నైవేద్యానికే కాకుండా అభిషేకాలకు సైతం ఈ నీటినే వాడుతారు. శక్తికుండంలో స్నానం చేసి శక్తిశ్వర స్వామిని దర్శించుకుంటే అపమృత్యు భయాలు తొలగిపోవడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్మకం. తురుష్కుల కాలంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు యత్నం జరిగిందట. నంది విగ్రహాన్ని ఖండిచగా దాని నుంచి వైజ్రవైడూర్యాలు బయటపడ్డాయని చెబుతారు. ఆ వెంటనే సంపదపై ఆశతో స్వామివారి విగ్రహంలో మరింత సంపద ఉంటుందని విగ్రహాన్ని సమీపించడంతో మండపం పైకప్పు కూలి తురుష్క ప్రభువు మరణించాడట.

Share this post with your friends
Exit mobile version