Site icon Bhakthi TV

ఈ ఆలయంలో ప్రసాదంగా ఏం అందిస్తారో తెలిస్తే..

కొన్ని ఆలయాల్లో ప్రసాదం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. చివరకు మాంసాహారాన్ని సైతం ప్రసాదంగా అందించే ఆలయాలున్నాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడి ఆలయం వెరీ స్పెషల్. వాస్తవానికి హిందూ దేవుళ్లకు ఉల్లిపాయలతో వండిన ఆహారాన్ని నివేదించరు. పైగా ప్రసాదంగా అందించరు. కానీ ఓ ఆలయంలో మాత్రం ఉల్లిపాయలు, పప్పులే ప్రసాదం. అసలీ ఆలయం ఎక్కడుంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే ఉల్లిపాయలు, పప్పులను ప్రసాదంగా పంచుతారు.

ఈ ఆలయం ఈ నాటిది కాదు. సుమారు 950 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో జానపద దేవత గోగాజీ కొలువై ఉన్నారు. సాధారణంగా ఉల్లిపాయలను తామసిక ఆహారం కాబట్టి హిదూ ఆలయాల్లో ఏ ప్రసాదంలోనూ ఉల్లిపాయను వినియోగించరు అలాంటిది ఈ ఆలయంలో ఉల్లిపాయనే ప్రసాదంగా పంచడం విశేషం. అయితే ఈ సంప్రదాయం కూడా ఆలయంలో ఇటీవలి కాలంలో ప్రారంభమైంది కాదు.. గోగమేడి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. ఇక్కడ నైవేద్యంగా సమర్పించే ఉల్లిపాయలు మనకు పెద్ద రాశులుగా పోసి కనిపిస్తున్నాయి. ఏడాదంతా అక్కడ ఉల్లి కుప్పలు ఉంటాయి.

Share this post with your friends
Exit mobile version