Site icon Bhakthi TV

శ్రావణమాసంలో ఈ పూజ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే..

శ్రావణమాసం శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. ఆధ్యాత్మిక పరంగానూ ఈ మాసం చాలా శ్రేష్టమైనది. ఈ సమయంలో ముఖ్యంగా ఒక పూజ నిర్వహిస్తే ఫలితం చాలా ప్రభావవంతంగా ఉంటుందట. ఎన్ని విధాలుగా ప్రయోజనాలుంటాయో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఆ పూజ ఏంటంటే.. రుద్రాభిషేకం. ఇది శ్రావణ సోమవారం నాడు చేయించుకుంటే మరీ మంచిది. శివుడికి రుద్రాభిషేకం చేయడం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

శ్రావణమాసంలో శివుడికి రుద్రాభిషేకం నిర్వహిస్తే ఎలాంటి కోరిక అయినా తీరుతుందని నమ్మకం. రుద్రాభిషేకం కారణంగా దైవశక్తి అనుగ్రహించి ఫలితాలు త్వరగా వస్తాయట. కొన్ని పనులు చాలా ఆలస్యమవుతూ ఉంటాయి. అలాంటప్పుడు రుద్రాభిషేకం చేయిస్తే చెడు గ్రహాల ప్రభావం తగ్గి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయట. అలాగే శ్రావణ సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకుంటే చంద్ర, శని, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. పవిత్రమైన నీళ్లతో లింగాభిషేకం చేయిస్తే శరీరం, మనసు శుభ్రపడతాయి. అలాగే పాలు, నెయ్యి, గంగాజలం వంటి వాటితో అభిషేకిస్తే మనసులోని ఆందోళనలు, భయాలు, ఒత్తిడి దూరమవుతుంది.

Share this post with your friends
Exit mobile version