Site icon Bhakthi TV

ఇవి మీ ఇంట ఉంటే ధనానికి ఏ లోటూ ఉండదట..

‘ధనం మూలం ఇదం జగత్’ అన్నారు పెద్దలు. ధనం లేదంటే ఏ పని కూడా జరగదు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందంగా ఉండాలంటే.. డబ్బు కావాల్సిందే. మనిషిని ఆర్థిక ఇబ్బందులు కృంగదీస్తుంటాయి. ఇలా డబ్బు సమస్యలతో బాధపడేవారికి వాస్తు శాస్త్రం కొన్ని రెమిడీస్ సూచించింది. కొన్ని జంతువులు మీ ఇంట ఉంటే డబ్బుకు ఎలాంటి లోటూ ఉండదట. అవేంటో తెలుసుకుందాం. మొదటిది ఏనుగు. లక్ష్మీదేవి వాహనమైన ఏనుగు కలలో కనిపించినా.. లేదంటే దాని బొమ్మ ఇంట్లో ఉన్నా కూడా డబ్బుకు ఎలాంటి లోటూ ఉండదట.

చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం అక్వేరియంని పెట్టుకుని పలు రకాల చేపలను పెంచుతారు. అయితే ఈ చేపల్లో గోల్డ్ ఫిష్ ఉంటే చాలా మంచిదట. పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ఉంటుందట. ఇది ధనాన్ని సైతం తెచ్చి పెడుతుందట. అలాగే గుర్రం. ఇది వేగానికే కాకుండా సామర్థ్యానికి సైతం చిహ్నమని చెబుతారు. తథాస్తు దేవతలైన అశ్వనీ దేవతలను గుర్రంతో పోలుస్తారు కాబట్టి గుర్రం పెయింటింగ్స్‌ను ఇంట్లో పెట్టుకుంటే మంచిదట. ఈ పెయింటింగ్స్ ఇంట్లో ఉన్న డబ్బు పరమైన లోటుండదట. ఇక చివరిగా తాబేలు. నిలకడకు సంకేతమైన తాబేలు ఇంట ఉంటే ధనం కూడా ఇంట నిలుస్తుందట. అయితే ఇవి తూర్పు ముఖంగా చూడటం మంచిది కాదట.

Share this post with your friends
Exit mobile version