Site icon Bhakthi TV

నాగ పంచమి రోజున ఇలా చేస్తే పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుందట..

హిందూ మతంలో శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివ కేశవుల అనుగ్రహం పొందడానికి.. భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో ఈ నెలలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో నాగ పంచమి రానుంది. ఈ మాసంలో వచ్చే పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకోనున్నారు. ఈ నాగ పంచమి రోజున శివుడితో పాటు నాగేంద్రుడికి పూజలునిర్వహిస్తారు. నాగ పంచమిని ఆగస్ట్ 9న జరుపుకోనున్నాం. ఈ రోజున నాగదేవతను పూజిస్తే పితృదోషంతో పాటు కాల సర్ప దోషం నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ దోషాలు తొలగిపోవాలంటే నాగ పంచమి రోజున శ్రీ సర్ప సూక్త పారాయణం చేయాలి.

నాగ పంచమి రోజున శివుడికి చందనం సమర్పిస్తే చాలా మంచిదట. కాబట్టి శివుడికి చందనాన్ని సమర్పించి ఆపై నుదుటున తిలకంగా దిద్దుకోవాలి. అలాగే ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి శ్రీ మద్ భగవద పురాణాన్ని, శ్రీ హరివంశ పురాణాన్ని పఠిస్తే పితృదోషం నుంచి కూడా ఉపశమనం తప్పక లభిస్తుందట. ఇక ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే.. నాగ పంచమి రోజున వెండి లోహంతో చేసిన జంట సర్పాలను సుబ్రహ్మణ్య ఆలయానికి దానం చేయాలట. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, దుఃఖాల నుండి ఉపశమనం పొందేందుకు నాగ పంచమి రోజున సూర్యాస్తమయం తరువాత నాగదేవత పేరుతో దేవాలయాలు, ఇంటి మూలల్లో మట్టి దీపాలను వెలిగించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి.

Share this post with your friends
Exit mobile version