Site icon Bhakthi TV

పుష్కరుడు ఏ రాశిలో ఉంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయి?

పుష్కరాల వెనుక ఉన్న కథేంటో తెలుసుకున్నాం. పుష్కరుడు తపస్సుకి మెచ్చిన శివుడు ఆయన ఏ నదిని ఆవహిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయని.. ఆ నది పవిత్రంగా మారుతుందని వరమిచ్చాడు. ఇప్పుడు ఏ లెక్కన పుష్కరాలు వస్తుంటాయో తెలుసుకుందాం. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తాడో అక్కడి నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. మరి ఏ ఏ రాశిలో సంచరిస్తే.. ఏ ఏ నదికి పుష్కరాలు వస్తాయో తెలుసుకుందాం.

మేష రాశిలో ప్రవేశిస్తే గంగానదికి, వృషభ రాశిలో నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కాటకంలో యమున, సింహరాశిలో గోదావరి, కన్యారాశిలో కృష్ణానది, తులారాశిలో కావేరి నది, వృశ్చికరాశిలో తామ్రపర్ణి నదికి, ధనుస్సు రాశిలో పుష్కర వాహిని, మకర రాశిలో తుంగభద్ర, కుంభరాశిలో సింధు, మీనరాశిలోకి ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. ఈ లెక్కన ప్రస్తుతం బృహస్పతి.. మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. కాబట్టి సరస్వతి పుష్కరాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

Share this post with your friends
Exit mobile version