Site icon Bhakthi TV

వామ్మో ఈ కన్నయ్యకు చ్చిన కానుకల విలువెంతో తెలిస్తే..

దేశంలో శ్రీకృష్ణుడి ఆలయాలకు కొదువేమీ లేదు. ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. వాటిలో రాజస్థాన్‌లోని ఓ ఆలయం ప్రసిద్ధి గాంచింది. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని సన్వాలియా సేథ్ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువయ్యాడు. ఈ ఆలయంలోని స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సమర్పించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఈ ఆలయ నిర్వాహకులు ట్రెజరీ గణన నిర్వహించారు. ఈ క్రమంలోనే భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తాజాగా వెల్లడించింది. ఇప్పటి వరకు రూ.23 కోట్ల నగదు, 1 కిలోల బరువున్న బంగారు బిస్కెట్‌తో పాటు చిన్న చిన్న బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు సమర్పించారు. అలాగే వెండి పిస్టల్, వెండి తాళం చెవి, వెండి మురళి వంటి అనేక వస్తువులను కూడా భక్తులు స్వామివారికి కానుకగా భక్తులు సమర్పించడం ఆసక్తికరం.

ఇప్పటి వరకూ స్వామివారికి వచ్చిన అతి భారీ కానుకలు ఇవేనట. ఈ విరాళాలన్నీ రెండు నెలల వ్యవధిలోనే వచ్చినవి కావడం గమనార్హం. తొలిదశలో రూ.11.34 కోట్లు.. రెండోదశలో రూ.3.60 కోట్లు.. మూడోదశలో మొత్తం రూ.4.27 కోట్లు కానుకగా వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఇప్పటి వరకూ లెక్కించిన మొత్తం నగదు విలువ రూ. 19.22 కోట్లుగా తేలింది. ఇంకా నగదు లెక్కింపు ప్రక్రియ పూర్తి కాలేదు. హుండీ లెక్కింపు ప్రక్రియను త్వరలోనేపూర్తి చేస్తామని.. హుండీలు, ఆన్‌లైన్ లో విరాళాలు, గిఫ్ట్ రూమ్‌ల నుంచి సేకరించిన బంగారం, వెండి వస్తువుల తూకం,వాటిని ఖరీదు కట్టడం ఇంకా చేస్తూనే ఉన్నామన్నారు.

Share this post with your friends
Exit mobile version