Site icon Bhakthi TV

ప్రపంచంలో ఉన్న ప్రతిదీ శ్రీకృష్ణుడిదే అయితే మనదేంటి?

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ శ్రీ కృష్ణుడిదేనని చెబుతారు. మరి మనది అని మనం చెప్పుకునేది ఏముంది? అనే సందేహం ప్రతి ఒక్కరికీ రావొచ్చు. మన దగ్గర ఉన్నవి ఏంటంటే… శరీరం, సంపద, ప్రతిభ, సంబంధాలు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. అవి మనకు శాశ్వతంగా చెందినవి కావు. కృష్ణుని కృపతో కొంతకాలం మన దగ్గర ఉంచబడ్డాయి అంతే. అయితే మన విలువ ఏమిటి? మన అసలు విలువ.. మనం శ్రీ కృష్ణునితో ఉన్న సంబంధంలో ఉంది? మనం ఆయన సేవకులం, ఆయన అంశాలమని చెబుతారు.

ప్రపంచంలో ఉన్న ప్రతిదీ శ్రీకృష్ణుడిదే అయితే మనదేంటి?

అదే మన నిజమైన గుర్తింపుగా పేర్కొంటారు. “ఇది నా సొంతం” అనే భావన అహంకారాన్ని పెంచుతుంది. కానీ “ఇది అంతా కృష్ణునిదే, నేను సేవ కోసం ఉపయోగించాలి” అనే భావన వినయాన్ని, శాంతిని ఇస్తుంది. మన వస్తువుల విలువ కూడా కృష్ణ సేవలో ఉపయోగించినప్పుడు మాత్రమే నిజమైన విలువ పొందుతుంది. లేనిపక్షంలో అవి కూడా తాత్కాలికమైనవే. కాబట్టి స్వామిత్వ భావాన్ని విడిచిపెట్టి, సేవాభావాన్ని పెంచుకుందాం. అప్పుడు జీవితం అర్థవంతంగా మారుతుందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version