Site icon Bhakthi TV

అడ్డంకులు తొలగేందుకు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలంటే..

శుభకార్యాలు, లేదంటే ఇతర పనున్లోల ఏమైనా అడ్డంకులు తలెత్తితే శనివారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవాలట. కాబట్టి శనివారం ఎలా పూజించుకోవాలో ముందుగా తెలుసుకుందాం. ఇంట్లో శుభకార్యాలు జరగడం కోసం శనివారం రోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పూజించాలనుకునే వారు అంటే ఇంటి యజమాని కానీ ఇంటి ఇల్లాలు కానీ సూర్యోదయంతోనే నిద్రలేవాలి. అనంతరం ఇల్లంతా శుభ్రం చేసుకుని శుచిగా స్నానమాచరించాలి. ఈ పూజలో వీలైతే కుటుంబ సభ్యులంతా పాల్గొంటే మంచిదట.

అడ్డంకులు తొలగేందుకు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలంటే..

పూజ చేసేవారు తప్పనిసరిగా పూజ పూర్తయ్యే వరకూ ఉపవాసం ఉండాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అనంతరం ఒక పీటకు పసుపు రాసుకోవాలి. దానిపై శ్రీలక్ష్మి నరసింహస్వామి చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి. ఆ తరువాత చిత్రపటానికి గంధం కుంకుమలతో బొట్లు, పూల మాలతో అలంకరించుకోవాలి. అనంతరం నరసింహ స్వామికి ప్రీతికరమైన తులసి మాలను సైతం వేయాల్సి ఉంటుంది. ఆవునెయ్యితో దీపారాధన చేసిన మీదట 108 తులసి దళాలు తీసుకుని శ్రీలక్ష్మి నరసింహస్వామిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. పూజ సమయంలో శ్రీలక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మూడు సార్లు పఠించాలి.

Share this post with your friends
Exit mobile version