Site icon Bhakthi TV

వేదమంత్ర ఉచ్చారణ ఎలా చేయాలి?

వేదమంత్ర ఉచ్చారణ ఎలా పడితే అలా చేయకూడదు. దానికీ ఓ పద్ధతి ఉంటుంది. నియమానుసారంగా మాత్రమే మంత్రాలను పఠించాలి.

మంత్ర దోషములు:

మన్రో హీన స్స్వరతో వర్ణతో వా, మిథ్యా ప్రయుక్తో న తదర్థ మాహ !
స వా గ్వ జ్రో యజమానం హినస్తి, యథేన్ద్ర శత్రు స్స్వరతో ≥పరాధాత్||

పతంజలి మహాభాష్యంలోని సూక్తి, వేద మంత్రోచ్చారణ నియమాలను వివరిoచారు. ప్రధాన సూత్రం ఏంటంటే.. వేద మంత్రాలకు సంబంధించి, వాటిని ఉచ్చరించేటప్పుడు స్వర దోషం (ట్యూన్ లేదా పిచ్ లోపం) గానీ, వర్ణ లోపం (అక్షర దోషం) గానీ ఏర్పడితే, ఆ మంత్రం సరైన అర్థాన్ని ఇవ్వదు. తప్పుగా ఉచ్చరించబడిన (మిథ్యా ప్రయుక్తమైన) ఆ మంత్రం వాక్కు, వజ్రాయుధం వలె మారి, ఆ మంత్రాన్ని ఉచ్చరించిన యజమానునికే హాని (సంహారం) కలిగిస్తుంది. ఉదాహరణకు ఇంద్రశత్రువు – త్వష్ట కథ.. ఈ విషయాన్ని నిరూపించడానికి త్వష్ట అనే దేవత కథను ఉదాహరణగా చెప్పారు.

తన కుమారుడైన విశ్వరూపుడిని సంహరించిన ఇంద్రుడిని చంపడం కోసం, త్వష్ట ఒక హోమం చేశాడు. ఆ హోమంలో స్వాహేంద్ర శత్రుర్వర్ధస్వ అనే మంత్రాన్ని ఉచ్చరించాలి. నిజానికి ఈ మంత్రాన్ని షష్ఠీ సమాస స్వరంతో ఉచ్చరించి ఉంటే, ఇంద్రుడికి శత్రువు (ఇంద్రుడిని సంహరించేవాడు) అని అర్థం వచ్చి, ఆ హోమం ఇంద్రుడిని సంహరించే కుమారుడిని ఇచ్చి ఉండేది. కానీ, త్వష్ట పొరపాటున ఈ మంత్రాన్ని బహువ్రీహి సమాస స్వరంతో ఉచ్చరించాడు. దీనివల్ల ఇంద్రుడే శత్రువుగా కలవాడు అనే అర్థం వచ్చి, ఇంద్రుడి చేతిలోనే చనిపోయే కుమారుడు జన్మించాడు. అంటే మంత్రం దోష స్వర ఉచ్చారణ కారణంగా, హోమం చేసిన యజమానుడైన త్వష్టకే హాని జరిగింది. కాబట్టి మంత్రోచ్ఛారణలో ఎలాంటి దోషాలు తలెత్తకూడదని పండితులు చెబుతారు.

Share this post with your friends
Exit mobile version