Site icon Bhakthi TV

ఏ కార్యంలో ఎన్ని దర్బలను వినియోగించాలి?

దర్భలలోని రకాల గురించి తెలుసుకున్నాం కదా. అవి మూడు రకాలు. పురుష జాతి దర్భతు, స్త్రీ జాతి దర్బలు, నపుంసక దర్భలు. ఏవి ఎలా ఉంటాయో కూడా ఇప్పటికే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరెవరిని తలుచుని దర్బలను ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. దేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలు దర్భ కొసలతోను, మానవులను తలచి యిచ్చే తర్పణాలలో దర్భల మధ్య భాగం నుంచి, పితృదేవతలను తలచుకొని యిచ్చే తర్పణాలలో ధర్భను మడిచి కొసలతోనూ తర్పణాలు సమర్పించడం విధాయకంగా ఉంది.

వైదిక కార్యాలలో “పవిత్రం” అనే పేరుతో దర్భతో చేసిన ఒక ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరింపజేసి ఆయా కార్యాలను ఆచరింపజేస్తారు. ఈ వేలిలో కఫనాడి వుండడం వలన ఈ ఉంగర ధారణ వలన కఫం శుభ్రం చేయబడుతోంది. ప్రేత కార్యాలలో ఒక దర్భతోను, శుభ కార్యాలలో రెండు దర్భలతోను, పితృ కార్యాలలో మూడు దర్భలతోను, దేవ కార్యాలలో నాలుగు దర్భలతోను‌, ఆ దర్భ ఉంగరాన్ని ముడి వేస్తారు. దేవతారాధన, జపం, హోమం, దానం తర్పణం వంటి కార్యాలలో ధర్భతో చేసిన ‘పవిత్రం’అనే యీ ఉంగరాన్ని తప్పనిసరిగా ధరించాలి.

Share this post with your friends
Exit mobile version