Site icon Bhakthi TV

కుమారస్వామి ఎలా అవతరించాడంటే..

ఇవాళ స్కంద పంచమి. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి కుమార షష్టి రోజున జన్మించాడు కాబట్టి ఈరోజుని కుమార షష్టిగా కూడా పిలుస్తూ ఉంటారు. అసలు కుమారస్వామి ఎలా అవతరించాడంటే.. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది.

ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా , సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే. స్కందపంచమి , కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా , రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి , షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలి.

Share this post with your friends
Exit mobile version