Site icon Bhakthi TV

శంఖం ఎలా పుట్టింది? ముందుగా దానిని ఎవరు అందుకున్నారు?

హిందువులు పూజలో చాలా వస్తువులు వినియోగిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో శంఖం ఒకటి. పూజా సమయంలో దీనిని ఊదుతూ ఉంటారు. ఇదొక పురాతన సంప్రదాయం. ఇలా పూజా సమయంలో శంఖం ఊదడం వలన ఆ శంఖం నుంచి వచ్చే శబ్దం కారణంగా ఇల్లంతా పాజిటివిటీ నెలకొంటుందని నమ్మకం. అలాగే శంఖం నుంచి వచ్చే శబ్దాన్ని ఆధ్యాత్మికతకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆలయాల్లోనూ శంఖ పూరిస్తూ ఉంటారు. ముందుగా అసలు శంఖం కథ ఏంటో తెలుసుకుందాం.

శంఖానికి హిందువులు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇది ఆధ్యాత్మికంగానూ.. పవిత్రతకు చిహ్నంగానూ భావిస్తారు. శుభాలకు సూచికగా భావించే ఈ శంఖం ఎలా పుట్టిందనేది పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం మందర పర్వతంతో సాగర మథనం గావిస్తున్న సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శంఖం ఉద్భవించిన వెంటనే దానిని విష్ణుమూర్తి అందుకున్నాడట. శంఖం పేరుకు ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. శం అంటే “మంచి” ఖం అంటే “నీరు” అని అర్థం. అంటే శంఖం జలాన్ని పావనం చేస్తుందట. అందుకే అంటారు పెద్దలు.. “శంఖంలో పోస్తేనే తీర్థం” అని.

Share this post with your friends
Exit mobile version