Site icon Bhakthi TV

దుర్గకు ఆ పేరెలా వచ్చింది? రాక్షస లక్షణాలేంటి?

దుర్గ అన్న నామమే పరమ పవిత్రం. అసలు అమ్మవారిని దుర్గ అని ఎందుకు పిలుస్తామంటే.. దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గ అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం. దుర్గ అనే నామంలో ‘ద’కారం దైత్యనాశనానికి, ‘ర’కారం రోగనాశనానికి ‘గ’ కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.

అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించకపోవడం, పర స్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపానం, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు.. ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షస లక్షణాలను తన ఉపసాకుల నుంచి ‘దుర్గా’ నామంలో ఉండే ‘ద’కారం తొలగిస్తుంది.

Share this post with your friends
Exit mobile version