
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకు యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలపూజ, హోమం, పట్టు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ కృష్ణ వర్మ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టితో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనుున్నారు. పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ సాయంత్రం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు.
