Site icon Bhakthi TV

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు పవిత్ర సుగంధ స్నానం

మూడవ రోజు స్నపన తిరుమంజనం సోమవారం రంగనాయకుల మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైన ఉత్సవమూర్తులకు పవిత్ర సుగంధ స్నానం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వేద పారాయణమారులు శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, నీలా సూక్తాలను లయబద్ధంగా ఆలపించారు. మూడవ రోజు సుగంధ స్నానం పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని విశేషమైన పూలమాలలు, కిరీటాలతో అలంకరించారు. లవంగాలు, ఏలకులు, అంజీర, పిస్తాతో పాటు గులాబీ రేకులు, స్ట్రాబెర్రీలతో ఉత్సవ మూర్తులను ఆకర్షణీయంగా అలంకరించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన తనిఖీలలో భాగంగా ఆరు వాహనాలను (3 టెంపోలు మరియు మూడు జీపులు) స్వాధీనం చేయడం జరిగింది. సదరు వాహనాల్ని అలిపిరి పోలీస్ స్టేషన్ నందు స్వాధీన పరచడం జరిగింది. పరిమితికి మించిన ప్రయాణికులతో, పర్మిట్ నిబంధనలను అతిక్రమించిన వాహనాలపై తనిఖీ రసీదులు నమోదు చేయడం జరిగింది.

Share this post with your friends
Exit mobile version