Site icon Bhakthi TV

భోజనానికి ముందు కాళ్లు, చేతులు ఎందుకు కడుక్కోవాలంటే..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సంపూర్ణమైన పోషకాహారం తీసుకోవడం ఎంతైతే అవసరమో.. తినేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం కూడా అంతే అవసరం. భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి బ్రహ్మ పురాణం వివరిస్తోంది. ఆ నియమాలు పాటిస్తూ భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయట. ఆ నియమాల్లో ఒకదాని గురంచి ముందుగా తెలుసుకుందాం. ఎవరైనా సరే అన్నం తినే ముందు కాళ్లు, చేతులు కడుక్కొని భోజనం చేయాలని బ్రహ్మ పురాణంతో పాటు సైన్స్ కూడా చెబుతోంది.

భోజనానికి ముందు కాళ్లు, చేతులు ఎందుకు కడుక్కోవాలంటే..

కాళ్లు, చేతులు కడుక్కోవడం వెనుక కారణమేంటంటే.. మనం భోజనం చేసేటప్పుడు శ్వాస వేగంగా తీసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో శ్వాసక్రియ రేటు పెరుగుతుంది. తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడు ఎన్ని శ్వాసలనేది ముందుగానే నిర్దారిస్తాడట. ఆ శ్వాసలు పూర్తయ్యాయా? మనిషి శరీరాన్ని విడిచిపెడతాడని బ్రహ్మ పురాణం చెబుతోంది. అందుకే, ఆ శ్వాసలు పెరగకుండా సరైన స్థితిలో ఉండడానికి భోజనానికి ముందు కాళ్లు, చేతులు కడుక్కోవాలట. ఈ విషయమై సైన్స్ ఏం చెబుతోందంటే.. భోజన సమయంలో శరీరంలో విద్యుదయస్కాంత శక్తి పెరుగుతుంది. అదే భోజనానికి ముందు కాళ్లూ చేతులు కడుక్కుంటే శరీరం ఆ శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి సైన్స్ పరంగా చూసుకున్నా.. పురాణాల పరంగా చూసుకున్నా భోజనానికి ముందు కాళ్లూ చేతులూ తప్పనిసరిగా కడుక్కోవాలి.

Share this post with your friends
Exit mobile version