
12-11-2026 – గురువారం
సాయంత్రం గం. 7.00 లకు దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవి ఉత్సవం
13-11-2026 – శుక్రవారం
సాయంత్రం గం. 7.00 లకు అరుణాచలేశ్వర ఆలయంలో పిడారి అమ్మ ఉత్సవం
14-11-2026 శనివారం
సాయంత్రం గం. 7.00 లకు అరుణాచలేశ్వర ఆలయంలో గణపతోత్సవం
15-11-2026 ఆదివారం
ఉదయం గం. 5.00 నుండి అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణం, సాయంత్రం అధికార నంది వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
16-11-2026 – సోమవారం
ఉదయం సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం ఇంద్ర విమాన వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
17-11-2026 మంగళవారం
ఉదయం భూత వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు సాయంత్రం సింహ వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
18-11-2026 – బుధవారం
ఉదయం సర్వ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం కల్పవృక్షం, కామధేనువు వాహనాలపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
19-11-2026 – గురువారం
ఉదయం వృషభ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం వెండి వృషభ వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
20-11-2026 – శుక్రవారం
ఉదయం అరవైముగ్గురు నాయనార్లు పల్లకీలలో మాడవీధులలో ఊరేగింపు. గజ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం వెండి రథంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
21-11-2026 – శనివారం
ఉదయం నుండి రాత్రి వరకు పంచమూర్తులు పంచ మహారధాలపై మాడవీధులలో ఊరేగింపు
22-11-2026 ఆదివారం
ఉదయం అశ్వ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. సాయంత్రం గం.4.00 లకు భిక్షాటనామూర్తి మాడవీధులలో ఊరేగింపు
రాత్రి పంచకళ్యాణి వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
23-11-2026 – సోమవారం
ఉదయం పురుషమృగ వాహనంపై చంద్రశేఖరమూర్తి మాడవీధులలో ఊరేగింపు. రాత్రి రావణ వాహనంపై సోమాస్కందమూర్తి మాడవీధులలో ఊరేగింపు
24-11-2026 మంగళవారం
తెల్లవారుజామున గం.4.00 లకు భరణిదీపం అరుణాచలేశ్వర ఆలయంలో సాయంత్రం గం. 6.00 లకు మహాదీపం అరుణగిరి పైన
25-11-2026 – బుధవారం
రాత్రి చంద్రశేఖరమూర్తి తెప్పోత్సవం
26-11-2026 – గురువారం
ఉదయం సోమాస్కందమూర్తి గిరి ప్రదక్షిణ, రాత్రి పరాశక్తి తెప్పోత్సవం
27-11-2026 – శుక్రవారం
రాత్రి సుబ్రహ్మణ్యేశ్వరుడి తెప్పోత్సవం
28-11-2026 శనివారం
రాత్రి చండేశ్వరుడు మాడవీధులలో ఊరేగింపు
