Site icon Bhakthi TV

విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్‌లో కృష్ణాష్టమికి పెద్ద ఎత్తున వేడుకలు..

విజయవాడలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఇక్కడ నిర్వహించనున్న వేడుకలపై ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు చక్రధారి దాస్ వివరాలు తెలిపారు. ఈ ఇస్కాన్ టెంపుల్‌లో మూడు రోజులపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. జూలై నెలలో రథోత్సవాన్ని మూడు రోజులపాటు నిర్వహించామని.. ఆ కార్యక్రమంలో 50 వేల మంది భక్తులు అందులో పాల్గొన్నారని తెలిపారు. ఆగస్టు 25 ,26, 27 తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చక్రధారి దాస్ తెలిపారు.

కన్నయ్యకు ఈ ఉత్సవాల నేపథ్యంలో108 రకాల నైవేద్యాలను సమర్పించనున్నారట. 25 ,26 తారీఖుల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాధాకృష్ణులకి 2వేల కిలోలతో పుష్పాభిషేకం.. పంచామృతాలతో కలశాభిషేకాలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో కళాశాల విద్యార్థులతో ఉట్టి మహోత్సవాన్ని కాంపిటేషన్ నిర్వహించనున్నారు. మొత్తానికి విజయవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు విజయవాడలో పండుగ వాతావరణం నెలకొననుంది. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాలని ఇస్కాన్ టెంపుల్ కోరుతోంది.

Share this post with your friends
Exit mobile version