Site icon Bhakthi TV

గొంతెమ్మ కోరికలు అనే నానుడి కుంతీదేవి కారణంగా వచ్చిందట.. అదెలాగంటే..

మహాభారతం విన్నా చదవినా పుణ్యమే సవ్తుందని అంటారు. అలాగే మహాభారతంలోని దర్మ సూక్ష్మాలు మనకు నిత్యం ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉన్నాయి. మహాభారతంలో కుంతీదేవి గురించి మనకు తెలిసిందే. పాండురాజు భార్య, పాండవుల తల్లి కుంతీదేవి. దుర్వాస మహామునికి సేవలు చేసిన కుంతీదేవికి ఆయన ఓ వరం ఇచ్చారు. ఆ వరాన్ని పరీక్షించాలనుకున్న కుంతీ.. సూర్యుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు సూర్యుడి కారణంగా కుంతీదేవికి కుమారుడు జన్మిస్తాడు.

ఆపై కుమారుడిని నదిలో వదిలేయడం, ఆ బాలుడు వేరొకరికి దొరకడం.. అతడే కర్ణుడని అందరికీ తెలిసిందే. ఆ తరువాత జరిగిన కథ కూడా మనకు తెలుసు. కర్ణుడి విలువిద్య గురించి తెలుసుకున్న దుర్యోధనుడు ఆయనను దగ్గరకు తీస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి కారణంగా పాండవులకు ముప్పు తప్పదని తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు.. కుంతీదేవిని కర్ణుడి వద్దకు పంపిస్తాడు. అక్కడ కుంతీదేవి కర్ణుడిని పాండవుల పక్షం వహించమని.. పాండవులకు హాని కలిగించవద్దని ఇలా చాలా కోరికలు కోరుతుంది. కుంతి + అమ్మ – కుంతెమ్మ కోరికలు కాస్తా కాలక్రమంలో అవి గొంతెమ్మ కోరికలుగా మారిపోయాయట.

Share this post with your friends
Exit mobile version