Site icon Bhakthi TV

మరకత నటరాజస్వామి సమీపంలోనే వారాహి అమ్మవారు..

రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న “తిరుఉత్తర కోసమాంగై” శివాలయం గురించి తెలుసుకున్నాం కదా. నటరాజ రూపంలో శివుడు గర్భాలయంలో 5 అడుగుల నటరాజుగా కొలువుదీరి ఉన్నాడు. మరకతంతో చేయబడిన విగ్రహమిది. ఈ మరకత విగ్రహం నుంచి వచ్చే ప్రకంపనలను మనం తట్టుకోలేమట. అందుకే శివుడు పూర్తిగా విభూది, గంధపు పూతతో కప్పబడి ఉంటాడు. శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. అలాగే ఆలయంలో స్ఫటిక లింగం కూడా ఉంటుంది.

నిత్యం ఈ స్పటిక లింగానికి మధ్యాహ్నం 12 గంటలకు అభిషేక ప్రియుడైన స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకానంతరం స్ఫటిక లింగాన్ని భద్రపరుస్తారు. మరో విశేషం ఏంటంటే.. ఈ ఆలయానికి సమీపంలో వారాహి అమ్మవారు కొలువుదీరారు. ఈ శివాలయానికి వచ్చిన వారంతా అమ్మవారిని దర్శించుకున్న మీదట వారాహి అమ్మవారిని సైతం దర్శించుకుంటారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు అక్కడి ప్రాంగణంలోనే పసుపు కొమ్ములను నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Share this post with your friends
Exit mobile version