Site icon Bhakthi TV

తిరుమల శ్రీవారికి గోదా మాలలు

శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు బుధవారం ఉదయం అలంకరించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుంచి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవి మాలలు తిరుపతి నుంచి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ‌ర్‌స్వామివారి మఠానికి బుధవారం ఉదయం చేరుకున్నాయి.

అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియ‌ర్‌ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version