Site icon Bhakthi TV

శ్రీ వేంకటేశ్వరస్వామి, గోవిందరాజస్వామివారి ఆలయాల్లో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. స్వామివారు గరుడునిపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

Share this post with your friends
Exit mobile version