Site icon Bhakthi TV

అక్టోబరు 17న పౌర్ణమి గరుడ సేవ

ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు.

తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల 16న బుధవారం శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 15వ తేది మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌. తిరుపతికి భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామల రావు ఆదేశించారు. 48 గంటల్లో తిరుపతిలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కోరారు.

Share this post with your friends
Exit mobile version