Site icon Bhakthi TV

ఆగ‌స్టు 17 నుంచి కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్సవాలు

కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 17 నుంచి తెప్పోత్సవాలు జరుగనున్నాయి. 17 నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాలు ఈ నెల 19వ తేదీ వ‌ర‌కూ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొద‌టి రోజు ఆగ‌స్టు 17న శ్రీ సీతాల‌క్ష్మణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారు, ఆగ‌స్టు 18, 19వ తేదీల్లో శ్రీ రుక్మిణి, స‌త్యభామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు తెప్పలపై విహరించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి 7.30 గంలకు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 9.30 నుంచి 10.30 గంట‌ల వ‌ర‌కు స్నప‌న తిరుమంజ‌నం నిర్వహించనున్నారు. ఆపై సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మప్రచార ప‌రిష‌త్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లా , కార్వేటినగరంలో ఉన్న హిందూ వైష్ణవ దేవాలయం ఇది . ఈ ఆలయంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. ఇది విష్ణుమూర్తి దశావతారంలో తొమ్మిదవ అవతారంగా పరిగణించబడుతుంది. దీనిని వేణుగోపాల అని పిలుస్తారు.

Share this post with your friends
Exit mobile version