Site icon Bhakthi TV

17 నుంచి ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు

ఏలూరు : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈ నెల 17 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు ఈ నెల 20 వరకూ జరుగనున్నాయి. పవిత్రోత్సవం అంటే సాధారణంగా శుద్ధీకరణ ప్రక్రియ. తెలిసీతెలియక జరిగే దోషాల నివారణార్థం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. స్వామివారు నిత్యం ఎంతో మందికి దర్శనమిస్తూ ఉంటారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మంచి అనుభవాన్ని పొందుతూ ఉంటారు. అయితే వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.

దోషాలనేవి కేవలం భక్తుల కారణంగానే జరగవు. వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆలయంలో అనుకోని ఘటనలు జరగవచ్చు. ఇటువంటి దోషాల పరిహరణార్థం సాధారణంగా పవిత్రోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో తెలిసో తెలియకో జరిగిన దోషాలన్నీ నివారించబడతాయి. ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియాకలాపంతో నిర్వహిస్తారు. వీటిని అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. ఇక పవిత్రోత్సవాల సమయంలో ఆలయంలో ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామివారికి జరిగే నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేయనున్నారు.

Share this post with your friends
Exit mobile version