
భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోయింది. ముస్లింలంతా పాక్‌కు వెళ్లిపోయారు. కాబట్టి పాక్‌లో ఉన్నదంతా ముస్లింలేనని అందరి అభిప్రాయం. ఎందుకంటే ఉన్న కొంతమంది కూడా భారతదేశానికి వచ్చేశారు. అయితే పాకిస్థాన్‌లోని ఒక జిల్లాలో మాత్రం ఇప్పటికీ హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉమర్‌కోట్, తార్పార్కర్ వంటి జిల్లాల్లో హిందువులు అత్యధికంగా ఉన్నారు. విభజన తర్వాత అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కానీ కొన్ని మాత్రం నేటికీ హిందూ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం పాకిస్థాన్‌లో హిందువుల సంఖ్య 39 లక్షలు కాగా.. అత్యధిక హిందూ జనాబా.. అక్కడి సింధ్ ప్రావిన్స్‌లో ఉంది.
సింధ్ ప్రావిన్స్‌లో దాదాపు నూటికి 93 మంది హిందువులు నివసిస్తున్నారు. ముఖ్యంగా సింధ్‌లోని ఉమర్‌కోట్, తార్పార్కర్, మిర్‌పుర్ఖాస్ , సంఘర్ జిల్లాల్లో హిందూ జనాభా ఎక్కువ. అంతేకాకుండా తార్పార్కర్ జిల్లాలోని ఇస్లాంకోట్‌లో ఒక సాధువు ఆశ్రమం కూడా ఉంది. హిందువులు అత్యంత సందర్శించే దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. తార్పార్కర్ రాజధాని మిథి నుంచి 45 కి.మీ దరంలో ఉన్న ఈ ఆశ్రమంలో దేవాలయాలు, విశ్రాంతి స్థలాలన్నీ మొత్తంగా 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ నిత్య పూజలతో పాటు కుల, మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఆహారం కూడా అందిస్తూ ఉంటారు. ఈ ఆశ్రమానికి వెళ్లేవారు ఆహారం వండుకోవడానికి అవసరమైన పదార్థాలను తీసుకుని వెళుతుంటారు.
