Site icon Bhakthi TV

చర్ల మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సర్వం సిద్ధం

చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీ పంచాయతీ పరిధిలో గల దేవానగరం గ్రామంలోని ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ఇవాళ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముందుగానే అన్ని ఏర్పాట్లనూ ఆలయ అధికారులు సిద్ధం చేశారు. ఎండాకాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లను నిర్వహించారు.

ఆలయ ప్రాంగణమంతా చలువ పందిళ్లు వేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. పాల్గుణ నమాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పన్నెండు గంటలకు దేవానగరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కల్యాణాన్ని కన్నులారా తిలకించారు.

Share this post with your friends
Exit mobile version