Site icon Bhakthi TV

గర్భగుడిలో దీపం లేకున్నా మూలవిరాట్టు దేదీప్యమానంగా మెరుస్తాడు.. ఎక్కడంటే..

ఒక దేవాలయంలో ఒక రాతి చేప ఉంటుంది. దానికి కానీ జీవం కలిగించామా? కలియుగం అంతమేనని అంటారు. అసలు ఆ ఆలయం ఎక్కుడంది? దాని విశేషాలేంటో తెలుసుకుందాం. ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో సౌమ్యనాథస్వామి దేవాలయం ఉంది. ఇది ఇప్పటి ఆలయం కాదు.. 11వ శతాబ్దానికి చెందిన పురాతన దేవాలయం. ఈ ఆలయం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంతో 108 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ఎవరైనా సరే.. 108 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తప్పక తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

ఇక ఈ ఆలయ విశేషాలు అన్నీ ఇన్నీ కావు. చోళ రాజవంశ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. చోళుల వాస్తు కళ ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తుంది. ఇక ఈ ఆలయ నిర్మాణమే ఓ అద్భుతం. సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం ఉండదు. కానీ మూలవిరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయ నిర్మాణం జరగడం ఇక్కడ ప్రత్యేకత. ఆలయంలో కొన్ని శాసనాలు, చిహ్నాలు మనకు దర్శనమిస్తాయి. కొన్ని శాసనాలపై సూర్య చంద్ర చిహ్నాలు.. ఆలయ కుడ్యాలపై మత్య్స, సింహ తదితర చిహ్నాలు ఉన్నాయి. ఆలయంలో ఓ అద్భుతం ఉంది. ఈ ఆలయంలో ఒక రాతి చేప ఉంటుంది. కలియుగం అంతానికి.. ఈ చేపకు సంబంధం ఉందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version