Site icon Bhakthi TV

నేటితో ముగియనున్న ద్వారక తిరుమల చిన వెంకన్న పవిత్రోత్సవాలు

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న పవిత్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ పూర్ణాహుతితో ఉత్సవాలకు అర్చకులు ముగింపు పలకనున్నారు. ఈ నెల 17 నుంచి ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఈ నెల 17 నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాలను ఆలయ అధికారులు, వేద పండితులు నిర్వహించారు. సాధారణంగా శుద్ధీకరణ ప్రక్రియనే పవిత్రోత్సవం అని పిలుస్తారు. వివిధ సందర్భాల్లో తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటి నుంచి నివారణ కోసం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

నిత్యం ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల అలాగే వివిధ హోదాల్లో పనిచేసే ఆలయ ఉద్యోగులు, అధికారుల వల్ల కూడా జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఆలయంలో జరిగే కొన్ని పనుల వల్ల కూడా దోషాలు తలెత్తుతాయి. వీటి పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలను ఆలయ సంప్రోక్షణ కంటే భిన్నమైన ప్రత్యేక క్రియా కలాపంతో అత్యంత పవిత్రంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామివారికి జరిగే నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. రేపటి నుంచి సేవలన్నీ యథావిధిగా జరిగే అవకాశం ఉంది.

Share this post with your friends
Exit mobile version