Site icon Bhakthi TV

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ.. పెద్ద ఎత్తున దర్శించుకుంటున్న భక్తులు

దసరా పండుగను దేశం మొత్తం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అంగరంగా వైభవంగా దసరా పండుగను నిర్వహించుకుంటున్నారు. ఇక విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో తెల్లవారు జామునుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ రాజరాజశ్వర దేవీ అలంకారంలో దుర్గమ్మ భక్తులను ఆశీర్వదిస్తోంది. నేటితో దసర ఉత్సవాలు ముగియనున్నాయి.

ఈ రోజు ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతితో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇవాళ ఉత్సవాల చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గా దేవి వివిధ కల్పాలలో నానావిధ దుష్టదనుజుల్ని, వివిధ రూపాలు ధరించి సంహరించింది. ఇలా అమ్మవారికి ఎక్కడా అపజయమే లేదు కాబట్టి అపరాజిత అయ్యింది.

Share this post with your friends
Exit mobile version