Site icon Bhakthi TV

శని జయంతి విషయంలో సందేహం.. అసలది ఎప్పుడంటే..

శని జయంతి ఎప్పుడనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. అసలు శనీశ్వరుడు ఎవరి కుమారుడు? ఆయన ఎప్పుడు జన్మించాడు? వంటి విషయాలను తెలుసుకుందాం. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు, ఛాయా దేవి దంపతుల కుమారుడు శనీశ్వరుడు అని పలు గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన వైశాఖ మాసం అమావాస్య రోజున జన్మించాడు. శనీశ్వరుడు కర్మప్రదాత కాబట్టి శని జయంతి నాడు పూజలు నిర్వహిస్తే సంతోషించి ఇబ్బంది పెట్టకుండా ఉంటాడని హిందువుల నమ్మకం. శనీశ్వరుడి జన్మదినోత్సవం రోజున శని దేవుడిని సరిగ్గా పూజిస్తే శని దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.

ఇక ఈ ఏడాది శనిశ్వరుడి జయంతి ఎప్పుడో తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్నది వైశాఖ మాసం కాబట్టి ఈ నెలలోనే శని జయంతి. మరి అమావాస్య ఎప్పుడు వచ్చింది? అంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 26న మధ్యాహ్నం 12:11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే మే 27న రాత్రి 8:31 గంటలకు ముగుస్తుంది. కనుక శనీశ్వరుడి జయంతిని మనం మే 27వ తేదీ మంగళవారం జరుపుకోనున్నాం. ఈ రోజున శనీశ్వరుడిని పూజిస్తే అన్ని రకాల వ్యాధులు, అప్పుల నుంచి ఉపశమనం, శని దోషాల నుంచి విముక్తి పొందుతారు. ఈ రోజున చేసే దానధర్మాలతో జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.

Share this post with your friends
Exit mobile version