Site icon Bhakthi TV

టీటీడీకి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ విరాళం..

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన విభాగానికి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వారు రూ.4.10 లక్షల విలువైన ఎరువులను సోమవారం విరాళంగా అందించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ, ఆర్ఎం శ్రీ రమణారెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ మురళి ఈ మేరకు ఎరువులను తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులుకు అందజేశారు. తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులను వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీ మధు, శ్రీ అనిల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రేపు శ్రీవేంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనులవారు తిరుమల మాఢవీధుల్లో విహరించనున్నారు. రేపు సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకూ శ్రీమలయప్ప స్వామివారి పవిత్రోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకూ జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

Share this post with your friends
Exit mobile version