అరటి ఆకులో భోజనం చేయడం హిందూ సంప్రదాయం. అరటి చెట్టు అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. అరటి పండ్లు, ఆకులు, కాండం ఇలా ప్రతిదీ మనకు ఏదో ఒక విధంగా అవసరమవుతుంది. ఇక అరటి ఆకులో భోజనం చేయడమనేది ఈనాటి సంప్రదాయం కాదు.. చాలా కాలంగా వస్తోంది. పూజలో కూడా అరటి కొమ్మలు మనకు సాయమవుతాయి. అరటి ఆకులో భోజనం చేయడమనేది ఆరోగ్యానికి సైతం మంచిది. అయితే మనం భోజనం చేసిన తర్వాత ఆకును మడతపెడతాం. దీనికి కారణమేంటి? ఎందుకు మడత పెడతామో తెలుసా?
భోజనం చేయడానికి ముందు అంటే ఆహార పదార్థాలను వడ్డించుకోవడానికి ముందే అరటి ఆకుపై నీళ్లు చిలకరించి పడేస్తాం. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. కీటకాలు, సూక్ష్మజీవులు, దుమ్మూధూళి ఉంటే తొలగిపోతుంది. అలాగే నీటిని చల్లితే ఆకు స్ట్రాంగ్ అవుతుంది. చిరిగిపోవడం జరగదు. ఇక భోజనం చేసిన తర్వాత దానిని లోపలికి మడత పెడతాం. దీనికి కారణమేంటంటే.. ఆహారాన్ని మనకు వడ్డించిన వారిపై గౌరవం చూపించడమేనట. కొన్నిసార్లు కొంత ఆహారం మిగిలిపోతుంది కాబట్టి ఇలా మడత పెట్టడం వల్ల సూర్యరశ్మి ఆకు లోపలికి ప్రవేశించదు. తద్వారా ఆహారం పాడుకాదు.