Site icon Bhakthi TV

శ్రీరాముడు చెక్కిన వీరాంజనేయ స్వామికి చిటికెన వేలు ఎందుకు లేదో తెలుసా?

గండి వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని స్వయంగా శ్రీరాముడే చెక్కాడట. ఆ కథేంటో చూద్దాం. సీతాపహరణ సమయంలో అమ్మవారిని వెదుకుతూ రామయ్య లక్ష్మణడితో కలిసి గండికి వచ్చాడట. అప్పట్లోనే అక్కడ వాయుక్షేత్రం ఉందట. ఆ క్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. రామయ్యను చూసిన వాయుదేవుడు ఆతిథ్యం స్వీకరించమనగా సున్నితంగా తిరస్కరించాడట. సీత జాడ కనుక్కుని తప్పక సీతతో కలిసి వస్తానని వాయుదేవుడికి శ్రీరాముడు మాటిచ్చాడట. రావణ సంహారం తర్వాత సీతమ్మతో కలిసి రామయ్య గండి క్షేత్రానికి వచ్చాడట. వీరి రాక గురించి ముందుగానే తెలుసుకున్న వాయుదేవుడు పాపాగ్ని నదిపై తన తపోబలంతో వారికి స్వాగతం పలుకుతూ తోరణాన్ని ఏర్పాటు చేశాడట.

ఈ తోరణం సూర్యకాంతి తగలగానే విభిన్న అందాలతో సీతారాములకు స్వాగతం పలికిందట. గండి క్షేత్రంలోని ప్రకృతి అందాలకు పరువశించిపోయిన రామయ్య అక్కడే కొంత సమయం ఉండిపోయాడట. ఆ సమయంలోనే తనకు సీతను తీసుకురావడంలో సహకరించిన హనుమంతుడిని తలచుకుని ఆయన విగ్రహాన్ని గండి క్షేత్రంలో చెక్కాడట. అయితే అయోధ్యకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమవడంతో చిటికెన వేలు చెక్కకుండానే రామయ్య వెళ్లిపోయాడట. అందుకే గండి వీరాంజనేయుడికి చిటికెన వేలు ఉండదని చెబుతారు. ఎవరైనా చెక్కేందుకు యత్నంచినా రక్తం కారుతుందట. కాబట్టి ఇక్కడి ఆంజనేయుడు సజీవంగా ఉన్నాడని అందరి నమ్మకం. ఇక వాయుదేవుడు ఏర్పాటు చేసిన స్వాగత తోరణం కూడా మహామహులకు తప్ప వేరెవ్వరికీ కనిపించదట.

Share this post with your friends
Exit mobile version