Site icon Bhakthi TV

జమ్మి ఆకులను ఎందుకు ‘బంగారం’ అని పిలుస్తారో తెలుసా?

దసరా నాడు జమ్మి చెట్టును ఎందుకు పూజించుకుంటామో తెలుసుకున్నాం కదా. జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉంది. మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడాన్ని ‘బంగారాన్ని పంచుకోవడం’ అని పిలుస్తారు. జమ్మి ఆకులను నిజమైన బంగారం మాదిరిగా అత్యంత విలువైనవిగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో తమ కోరికను ఒక చిటీపై రాసి జమ్మి చెట్టుకు కడతారు. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి తద్వారా సంపద, శ్రేయస్సు పెరుగుతుంది.

ప్రజలు దసరా రోజున జమ్మి ఆకులను ఇంటికి తీసుకుని వస్తారు. వాటిని ఇంట్లోని పూజ గదిలో లేదంటే ఎక్కడైనా భద్రంగా ఉంచుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ జమ్మి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ జమ్మి చెట్టు శనీశ్వరుడికి ఇష్టమైనది కాబట్టి ఈ దసరా రోజున జమ్మి చెట్టును పూజిస్తే శనీశ్వరుని ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయట. తద్వారా వృత్తి, వ్యాపారాలు లేదంటే ఇతర కార్యక్రమాలు ఏవైనా కూడా తగ్గిపోతాయని నమ్మకం. అంతేకాకుండా జమ్మి చెట్టును క్రమం తప్పకుండా పూజించే వారు తమ జీవితంలో స్థిరత్వాన్ని పొందడంతో పాటు శత్రువులపై విజయం సాధిస్తారట.

Share this post with your friends
Exit mobile version