Site icon Bhakthi TV

కంటి సమస్యలను దూరం చేసే ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలోని దేవాలయాలు ప్రతి ఊరిలోనూ ఉంటాయి. వాటిలో కొన్ని దేవాలయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆయా దేవాలయాల చరిత్ర, సంస్కృతి ముఖ్యంగా రహస్యాలు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. దేవాలయాలు మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. కొన్ని ఆలయాలకు వ్యాధులను నయం చేసే గుణం కూడా ఉందని చెబుతారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మనం గతంలోనూ కొన్ని ఆలయాల్లోని కోనేటిలో స్నానమాచరిస్తే వ్యాధులన్నీ తొలగిపోతాయని తెలుసుకున్నాం.

ఒక ఆలయం కంటి సమస్యలను దూరం చేస్తుంది. అదెక్కడో కాదు.. తమిళనాడులో ఉంది. ఎవరైనా సరే.. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారు తమిళనాడు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న వెల్లిశ్వరర్ ఆలయానికి వస్తే చాలు. ఇక్కడి శివయ్య మహిమతో కంటి సమస్యలన్నీ దూరమవుతాయి. ఇక్కడి శివయ్యను వెల్లీశ్వరర్‌గా భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించే స్వామివారికి పువ్వులు సమర్పించి పూజిస్తే చాలు.. శివయ్య సంతోషిస్తాడని నమ్మకం. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడి శివయ్యను భక్తితో పూజించుకుంటే కంటి సమస్యలన్నీ దూరమవుతాయి.

Share this post with your friends
Exit mobile version