Site icon Bhakthi TV

రామాయణం, భారతాలలో ముడి పడి ఉన్న ఆలయం ఎక్కడుందో తెలుసా?

దేశంలో రామాలయాలు ప్రతి ఊరిలోనూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని అత్యంత ముఖ్యమైనవి. వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఉంది. విజయనగరానికి 12 కి.మీ దూరంలో నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం అనే గ్రామ పంచాయతీలో ఉంది. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే.. ఇక్కడ రామాయణ, మహా భారత ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. ఈ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా మహా శివరాత్రితో పాటు శని వారాల్లో ఈ ఆలయాన్ని చాలా ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

ఇక ఈ రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ కొండే రామాయణం, మహాభారత ఆనవాళ్లను కలిగి ఉందని చెబుతారు. బోదికొండ అనేది ఏకశిల. ఒకే ఒక్క రాతిపై ఏర్పడిన కొడ.. దీనిపై రామాలయం.. చూడటానికే అద్భుతంగా ఉంటుందా ప్రదేశం. ఈ కొండపైన రామాయణ, మహాభారత ఆనవాళ్లు కనిపించడమే కాకుండా జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై బౌద్ధారామంతో పాటు జైన్ ఆలయం కూడా ఉంది. అయితే జైన్ ఆలయం శిథిలావస్థలో ఉంది. రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన వారు బోదికొండను సైతం సందర్శిస్తూ ఉంటారు.

Share this post with your friends
Exit mobile version