
మన దేశంలో ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంటుంది. దాదాపు అన్ని శివాలయాల్లోనూ చాలా వరకూ శివుడు లింగరూపంలోనే ఉంటాడు. విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు కనీసం వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. అలాంటి పార్వతీ మాత ఒడిలో శివుడు పడుకున్న భంగిమలో మనం ఎక్కడైనా చూస్తామా? అంటే ఒక ఆలయంలో చూడవచ్చు. అక్కడి శివుడిని శయన శివుడని పేర్కొంటూ భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడుంది? అసలు ఈ ఆలయం పేరిట ప్రసిద్ధిగాంచిందో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలో సురుటుపల్లి అనే గ్రామంలో శయన శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి క్షేత్రాన్ని పల్లి కొండేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడే పార్వతీ మాత ఒడిలో పడుకున్న రూపంలో శివుడు కనిపిస్తాడు. దేశంలో శివుడు శయన రూపంలో ఉన్న విగ్రహం ఇదొక్కటే కావడం విశేషం. శ్రీ మరగదాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామి క్షేత్రంలో శివుడు అసలు ఎందుకు అలాంటి భంగిమలో ఉన్నాడనడానికి ఓ ఆసక్తికర కథ ప్రచారంలో ఉంది. ఈ కథ గురించి వ్యాస మహర్షి రచ్చించిన శివ మహా పురాణంలో ఉంది.
