Site icon Bhakthi TV

శ్రీరాముడు ప్రతిష్టించి పూజించిన శివలింగం ఎక్కడుందో తెలుసా?

శ్రీరాముడికి శివుడంటే అమితమైన భక్తి అట. ఏదైనా పని చేసే ముందు శివుడిని ఆరాధించేవాడట. రావణుడు సీతమ్మను అపహరించిన తరువాత శ్రీరాముడు లంకకు వెళ్లాడు. రావణుడితో యుద్ధం చేసి ఆమెను తీసుకొచ్చాడు. రాముడు లంకకు వెళ్లే సమయంలో ఆ భూమి చాలా పవిత్రమైనదని.. అక్కడ శివలింగాన్ని ప్రతిష్టిస్తానని వానర సేనకు చెప్పాడట. అలా రామేశ్వరంలో చెప్పిన మాట ప్రకారం రాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడట. అంతకాకుండా తాను ప్రతిష్టించిన శివలింగం ఉన్న రామేశ్వరాన్ని దర్శించుకున్న వ్యక్తి మరణానంతరం తన లోకాన్ని చేరుకుంటాడని వివుడు చెప్పాడట.

ఈ క్షేత్రానికి రాముడితో అనుబంధం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి రామేశ్వరం అని పపేరు వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాకు సమీపంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. శివుని 11వ జ్యోతిర్లింగంగా దీనిని పేర్కొంటారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. త్రేతా యుగం అనంతరం ఈ ఆలయాన్ని పలు మార్లు పునరుద్ధరించారు. ముఖ్యంగా పలువురు రాజులు ఈ ఆలయ అభివృద్ధి చేశారు. ఆదిత్యవర్మన్ I, రాజేంద్ర చోళ I, రాజరాజ చోళ I, కృష్ణదేవరాయలు వంటి అనేక మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసిన వారిలో ఉన్నారు.

Share this post with your friends
Exit mobile version