Site icon Bhakthi TV

భక్త కన్నప్ప స్వస్థలం ఎక్కడుందో తెలుసా?

భక్త కన్నప్ప గురించి తెలియని వారుండరు. పరమశివుడికి అత్యంత గొప్ప భక్తుడు. శివుడి తన రెండు కళ్లను ఇచ్చి చరిత్రలో నిలిచిపోయిన మహా భక్తుడు. ఈ కథ గురించి దాదాపు హిందువులందరికీ తెలిసే ఉంటుంది. అసలు భక్త కన్నప్ప స్వస్థలం ఏంటి? దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామమే కన్నప్ప స్వస్థలమని చెబుతారు. అక్కడ కన్నప్ప ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే భక్త కన్నప్ప విగ్రహంతో పాటు అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అది కన్నప్ప స్వగ్రామమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా అదేనని చెబుతారు.

ఇక ఈ గ్రామంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం చేతిలో విల్లు బాణం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయంలోనే ఉపాలయంగా అన్నమయ్య అమ్మమ్మ చింతాలమ్మ విగ్రహాన్ని సైతం ప్రతిష్టించడం జరిగింది. ఇక్కడ ఉన్న శివలింగం.. భక్త కన్నప్ప ప్రతిష్టించినదేనని చెబుతారు. ఊటుకూరే కన్నప్ప స్వగ్రామం అని తమిళ పెరియ పురాణం తెలియజేస్తోంది. అయితే కన్నప్ప విషయంలో తమిళులు, కన్నడిగులు తమవాడంటే తమ వాడంటూ చెప్పుకుంటున్నారు. కడప జిల్లాకు చెందిన సాహితీ శాస్త్రవేత్తలు మాత్రం భక్త కన్నప్ప ఊటుకూరు వాసి అని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version