Site icon Bhakthi TV

తులసి వివాహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తులసి వివాహం గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కదా.. కార్తీక మాసంలో ద్వాదశి రోజున నిర్వహిస్తారు. ద్వాదశి తిథి ప్రకారం 13న లేదంటే 14న తులసి వివాహాన్ని నిర్వహిస్తారు. తులసి వివాహం రోజున ఆచారాల ప్రకారం శాలిగ్రామాన్ని, తులసిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి ఆ ఇంట ఆనందం, శాంతి నెలకొంటాయట. ఇక తులసి వివాహాన్ని ఎలా నిర్వహించాలనేది ఇప్పటికే తెలుసుకున్నాం కదా. ఇక ఈ వివాహం సమయంలో తులసి మొక్కకు అలంకరణ వస్తువులు సమర్పించిస్తే చాలా మంచిదట. దీని వలన అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి.

తులసి వివాహాన్ని ఏ రోజున అయితే నిర్వహిస్తారో.. ఆ రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. దీని వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయి. తులసి వివాహం సమయంలో మొక్కకు ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. అనంతరం సాయంకాలం వేళ తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించాలి. అలా వెలిగిస్తే మనకు లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. తులసి వివాహం చేయడం వల్ల పెళ్లి కాని వివాహం కుదురుతుందట. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందట. దీనితో పాటు కుటుంబంలో ఆనందంతో పాటు సిరి సంపదలకు లోటుండదట.

Share this post with your friends
Exit mobile version