Site icon Bhakthi TV

కనుదిష్టికి ఏం చేయాలో తెలుసా?

నరదిష్టికి నల్లరాయి కూడా పగులుతుందని చెబుతారు. అలాంటి నరదిష్టిని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. మనిషికి నరదిష్టి ఉన్నట్టే వాహనాలకు కనుదిష్టి ఉంటుంది. మరి మనుషులు అయితే ఏదో ఒకరకంగా నరదిష్టిని పోగొట్టుకుంటారు కానీ వాహనాలకు కనుదిష్టిని పోగొట్టడం ఎలాగో తెలుసుకుందాం. ఎవరైనా కొత్త కారు, బైకు, లేదంటే ఎలాంటి వాహనం అయినా తీసుకున్నప్పుడు దానిపై ఎదుటివారి కనుదిష్టి తప్పకుండా ఉంటుంది. దానికోసం కొన్ని పరిహారాలు చేస్తే కనుదిష్టి పోతుందట. అవేంటో తెలుసుకుందాం.

వెహికిల్ కొన్న తరువాత వెంటనే హ్యాండిల్‌కు ఒక ఎరుపు, నలుపు రంగు దిబ్బన్‌ను కలిపి కట్టిన మీదటే బయటకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వలన కనుదిష్టి తొలగిపోతుందట. ఆ తరువాత వాహనానికి పూజ చేయించుకోవాలి. అలాగే కొత్త వాహనాన్ని కొని ఇంటికి తీసుకు రాగానే 6 గవ్వలు, 5 జీడి గింజలు తీసుకొని వాటిని ఒక రాగి వైరుకి ఒక గవ్వ, ఒక జీడిగింజ చొప్పున గుచ్చి మీ వెహికిల్‌కి కట్టాలి. ఇలా చేస్తే దిష్టిదోషం తొలుగుతుందట. మనిషిపై దిష్టి కారణంగానూ బండికి ఇబ్బందులు తలెత్తుతాయట. అలా జరిగితే జిల్లేడు నారతో చేసిన తాడు కొని కొత్త వాహనం కొనగానే ఆ తాడును మీ కుడి చేతి మణికట్టుకుకు కట్టుకుంటే కనుదిష్టి అనేది ఉండదట.

Share this post with your friends
Exit mobile version