Site icon Bhakthi TV

సుబ్రహ్మణ్య షష్టి రోజున పూజా విధానం ఏంటో తెలుసా?

మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్టి ఎప్పుడో మనం తెలుసుకున్నాం కదా.. సుబ్రహ్మణ్య షష్టి నాడు పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్టి నాడు బ్రహ్మముహూర్తానే లేచి శుచిగా స్నానమాచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ముందుగా స్వామివారి విగ్రహం లేదంటే చిత్రపటం ప్రతిష్టించిందుకు పీటను సిద్దం చేసుకోవాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. అనంతరం పీటపై ఆరు ముఖాలు కలిగిని సుబ్రహ్మణ్యస్వామి చిత్రపటాన్ని ఉంచి దానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. అనంతరం ఫోటో ఎదురుగా ప్రమిదలు పెట్టి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఆ ఆరు వత్తులు స్వామివారి ఆరు ముఖాలకు ప్రతిరూపమని చెబుతారు.

అలాగే నవగ్రహాల్లో కుజుడికి అధిష్ఠాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. సుబ్రహ్మణ్యస్వామిని ఎర్రని పూలతో పూజిస్తూ స్వామివారి 108 నామాలను పఠించాలి. అవి చదవలేని వారు “ఓం సాం శరవణ భవా” అనే మంత్రాన్ని చదవొచ్చు. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపించాలి. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను కానీ దానిమ్మ గింజలు కానీ పెట్టవచ్చు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం నిర్వహిస్తే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందట.

Share this post with your friends
Exit mobile version