Site icon Bhakthi TV

శ్రీకాళహస్తిలో శివలింగం నుంచి వచ్చే గాలికి ఏం జరుగుతుందో తెలుసా?

దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తి గురించి మనకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ‘కన్నప్ప’ చిత్రం తర్వాత ఈ ఆలయం మరింత వార్తల్లో నిలుస్తోంది. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుంచి వచ్చు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం.

వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం రాసిన దూర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి. కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడు. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడు. అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

Share this post with your friends
Exit mobile version