
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం సత్ఫలితం కలగాలంటే.. ముందుగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుందట. అవేంటో చాలా మందికి తెలియదు. అవేంటో చూద్దాం. స్వామివారి దర్శనానికి వెళ్లడానికి ముందు పుష్కరిణిలో స్నానం చేయాలి. ఆ తరువాత అక్కడే ఉన్న వరాహ స్వామి వారి ఆలయానికి వెళ్లి.. ఆయనను దర్శించుకోవాలి. వీలైతే వరాహ స్వామికి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలట. అలా సమర్పిస్తే చాలా మంచిదట. ఆ తరువాత మాత్రమే వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు.
ఇక తిరుమల కొండ ఎక్కేటప్పుడు మాత్రమే కాదు.. తిరుమల కొండపై సైతం చెప్పులు వేసుకుని నడవరాదని పండితులు చెబుతున్నారు. అలాగే కొండపై విపరీతంగా పువ్వులు అమ్ముతూ ఉంటారు. వాటిని చూడగానే మహిళలు కొనేసి తలలో పెట్టుకుంటారు. ఇలా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొండ మీద పూల ధరించకూడదట. అంతేకాకుండా దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చిన్న పిల్లలపై కోప్పడటం, కొట్టడం వంటివి చెయ్యకూడదట. అలాగే ఎవరితోనూ గొడవలకు పోకూడదట. ఈ నియామాలు పాటిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుందట..
