Site icon Bhakthi TV

శ్రావణ మాసంలో లింగాష్టకం పఠిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

శివుడిని భోళా శంకరుడని అంటారు. భక్తితో కాస్త నీళ్లు పోసినా కూడా చాలా ఆనందించి మనం కోరిన కోరిక ఏదైనా నెరవేరుస్తాడట. మహాదేవుని అనుగ్రహం లభిస్తే చాలు.. ఇంట సంతోషాలు విరబూస్తాయట. స్వామివారికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి బిల్వపత్రంతో పూజిస్తే మరింత సంతోషిస్తాడట. ఇక కొద్ది రోజుల్లో శ్రావణ మాసం రానుంది. ఈ వ్రావణ మాసంలో లింగాష్టకం పఠిస్తే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందట. మహాదేవుని అనుగ్రహాన్ని పొందుతాం. శివుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ లింగాష్టకం పఠిస్తే మనకు ఎనిమిది రకాల దోషాలు తొలగిపోతాయని నమ్మకం.

సమస్యలు లేని మనిషి అంటూ ఉండరు. అయితే కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుంచి బయటపడటం కష్టం. అటువంటి వారు శ్రావణ మాసంలో లింగాష్టకం పారాయణం చేయాలట. శివయ్యను నిత్యం ధ్యానిస్తే చాలు.. భక్తునికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. లింగాష్టకం జీవితంలో ప్రతి ఒక్క అంశంలో శుభంతో పాటు విజయాన్ని తెలియజేస్తుందట. దీనిని పఠించడం వలన పేదరికం తొలగిపోతుందట. అష్ట దు:ఖాలు మాయమై జీవితం సంతోషంగా మారిపోతుందట. భోళా శంకరుడు భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

Share this post with your friends
Exit mobile version