Site icon Bhakthi TV

బవాడి గణేశ్‌కి సూర్య, చంద్రులను సమర్పిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని బవాడి అనే గ్రామంలో ఓ గణేశుడి ఆలయం ఉందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే చాలు.. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని నమ్మకం. ఈ ఆలయానికి పెళ్లికాని యువతీ యువకులు, వారి తల్లిదండ్రులతో వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 400 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ మెట్ల బావి తవ్వుతుండగా వినాయకుడి విగ్రహం బయల్పడింది. ఆ విగ్రహాన్ని ముందుగా బావి నుంచి బయటకు తీసి వేదికపై ఉంచి పూజలు నిర్వహించేవారు. అనంతర కాలంలో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.

వివాహ అడ్డంకులు ఉన్నవారు ఈ వినాయకుడిని సందర్శించి పూజలు చేయడం వలన విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ముఖ్యంగా బుధవారం స్వామివారికి సూర్యచంద్రులను సమర్పించాలి. అనంతరం పరిక్రమ చేస్తే వివాహ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయట. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేయాలి. ఈ ఆలయంలో శివుడు కూడా ఉంటాడు. ముక్తేశ్వర మహాదేవుడిగా శివుడు పూజలందుకుంటున్నాడు. పైగా ఇక్కడ పూజలు నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సైతం గట్టెక్కుతారట. నిత్యం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends
Exit mobile version