Site icon Bhakthi TV

ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వింటే ఏం జరుగుతుందో తెలుసా?

యముడు పేరు వింటే భయపడని వారుండరు. యముడు ధర్మబద్దమైనవాడే కాకుండా కర్మకు సరైన శిక్షను వేస్తాడు. యముడిని పూజించే సందర్భాలు చాలా తక్కువ. అలాంటి వాటిలో ఒకటి ధర్మరాజ దశమి. ఇవాళే ధర్మరాజ దశమి. చైత్ర శుక్ల దశమికే ధర్మరాజ దశమి. ఈ రోజున శివుడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని నమ్మకం. అలాగే ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వింటే మరణ భయం ఉండదట. మరి ఆ కథేంటో తెలుసుకుందాం.
పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వాజశ్రవుడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.

ఈ వజాశ్రవుడు ఒకసారి యాగం చెయ్యాలని అనుకున్నాడు. అయితే ఈ యాగం నిర్వహించిన వారు తమ దగ్గరున్న సంపదలన్నీ దానం చెయ్యాలి. కానీ వాజశ్రవుడు తన దగ్గరున్న సంపదలన్నింటినీ దానం చేయలేదు. యాగం అయిపోయిన తరువాత కేవలం అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరున్న ఆవులలో ఒట్టిపోయిన వాటిని అందరికీ దానం చేస్తున్నాడు. తండ్రి చేస్తున్న పని నచికేతుడికి నచ్చకపోవడంతో.. దానం ఏదైనా ఇతరులకు ఉపయోగపడాలని.. ఇలా ఉపయోగం లేని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏముందని ప్రశ్నించాడు. తనను కూడా ఎవరికైనా దానం చేయమని చెప్పాడు. నచికేతుడి మాటలు నచ్చని వాజశ్రవుడు ఆగ్రహించాడు. అయినా ఆగకుండా నచికేతుడు విసిగించడంతో వాజశ్రవుడు ‘నిన్ను యముడికి ఇస్తా’ అని చిరాకులో చెప్పాడు. ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version